సురక్షిత ప్రాంతానికి అంగన్వాడీ పిల్లలు!
అరకులోయ, నవంబరు 3, మేజర్ న్యూస్:
"అంగన్వాడీ పిల్లలకు పొంచి ఉన్న ప్రమాదం"అనే శీర్షికతో "సూర్య దినపత్రిక"లో వెలువడిన వార్తా కథనానికి ఐ సి డి ఎస్ అరకులోయ ప్రాజెక్ట్ సూపర్ వైజర్ కె.లక్ష్మి స్పందించారు.ఈనెల 3వ తేదీ మంగళవారం "సూర్య దినపత్రిక"లో ప్రచురితమైన వార్తపై స్పందించిన సూపర్ వైజర్ మండలంలోని మాడగడ పంచాయతీకి చెందిన డింగిరిపుట్టు గ్రామ అంగన్వాడి కేంద్రాన్ని వెను వెంటనే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.సొంత భవనం లేక శిధిలావస్థకు చేరిన డింగిరిపుట్టు పాఠశాల భవనంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తుండడాన్ని స్వయంగా గమనించిన సూపర్ వైజర్ అక్కడ నుంచి మరో ఇంట్లో అంగన్వాడీ కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి గిరిజన చిన్నారులను తరలించారు.శిధిలావస్థకు చేరిన భవనంలో ఉన్న గిరిజన పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించడం పట్ల ఆ గ్రామానికి చెందిన అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు సూపర్ వైజర్ కె.లక్ష్మీ కు కృతజ్ఞతలు తెలిపారు.గిరిజన పిల్లల ప్రాణాలతో ఐసిడిఎస్ చెలగాటమాడుతోందని సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ సభ్యురాలు వి.వి. జయ ఆరోపించిన విషయం,నూతన అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి పాఠకులకు విధితమే.ఈ కార్యక్రమంలో డింగిరిపుట్టు గ్రామ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త పి.ప్రమీలదేవి పాల్గొన్నారు.