BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి

Select Suryaa Now
క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి

విజయవాడ మేజర్ న్యూస్ : రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ (యుసిపిఐసి) చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. క్రైస్తవులు, పాస్టర్లు, మతపెద్దలపై జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న దాడులపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, చర్చిలు, ప్రార్థనా మందిరాల కూల్చివేతలు, దాడులను అరికట్టి భద్రత కల్పించాలని కోరారు. తప్పుడు కేసులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతులు అవసరమైన చర్చిలకు ఒక్కోదానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ప్రతి గ్రామంలో క్రైస్తవ శ్మశానవాటికకు స్థలం కేటాయించి, ఉన్న వాటిని ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు. పాస్టర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంతో పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తమ కృషి కొనసాగిస్తామని డాక్టర్ కోలా ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓగ్గు గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.