కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా
కంకిపాడు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ మైనారిటీ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షుడు షేక్ చిన్నా అన్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ఆ పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదని, మరింత పెరిగిందని నిరూపితమైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆదరణ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసే విజ్ఞప్తులకు లభిస్తున్న ప్రాధాన్యం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ కూటమి ఇదే విజయ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని షేక్ చిన్నా విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.