BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి..

Select Suryaa Now
వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి..

విజ‌య‌వాడ‌, మేజర్ న్యూస్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ బుధవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు (ఏఈవో), జిల్లా నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ అనంతరం సమర్పించాల్సిన ఎన్నికల వ్యయ నివేదికల తయారీ, వివరాల నమోదు, పరిశీలనకు సంబంధించిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. అభ్యర్థులపై అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు, పెండింగ్ కేసులు, రిజిస్టర్ల నిర్వహణ, నగదు, మద్యం, ఇతర వస్తువుల స్వాధీనాలు, పెయిడ్ న్యూస్ అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపుల ఖర్చులు, అభ్యర్థుల రోజువారీ వ్యయ రిజిస్టర్లు, రాజకీయ పార్టీల ఖర్చులు త‌దిత‌రాల‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, వీడియో సర్వైలెన్స్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ, తమ రికార్డులను ప్రతిరోజూ సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా నమోదు చేసి, సంబంధిత ఆధారాలతో నివేదికలను సిద్ధం చేయాలని, పోలింగ్ పూర్తయిన అనంతరం నిర్దేశిత గడువులోగా సంతకం చేసిన నివేదికలను స‌మ‌ర్పించాల‌ని బి.విజయకుమార్ విజ‌య కుమార్ స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.