BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్

Select Suryaa Now
వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు మేజర్ న్యూస్ : ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను గుర్తించి, వార్డుల అభివృద్ధికి నూతన కౌన్సిలర్లు అంకితభావంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచించారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు బుధవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో తమ విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చొరవ చూపాలని కోరారు. ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు బోర్ర సుబ్బారావు, పలియాల శ్రీనివాసరావు, రాజులపాటి ఫణికుమార్, జంపాన చినబాబు తదితరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.