BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం

Select Suryaa Now
లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం

సూర్య టూరిజం డెస్క్, లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ ఎక్సెల్ (ExCeL London) వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) లండన్ 2026 ప్రదర్శనలో తెలంగాణ పర్యాటక శాఖ ఘనమైన ముద్ర వేసింది. నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ పర్యాటక ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక ప్రత్యేక పెవిలియన్‌ను భారత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సుధా మూర్తి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

అంతర్జాతీయ పర్యాటకులు, గ్లోబల్ టూర్ ఆపరేటర్లు మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రాధాన్యతను పరిచయం చేయడంలో ఈ ప్రారంభోత్సవం కీలక మైలురాయిగా నిలిచింది. పెవిలియన్‌ను సందర్శించిన ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రదర్శనలను తిలకించి, రాష్ట్ర పర్యాటక వైవిధ్యం మరియు గొప్ప వారసత్వ సంపదను అంతర్జాతీయ వేదికపై చాటుతున్న తీరును ప్రత్యేకంగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి శిక్తా పట్నాయక్ (ఐఏఎస్), పర్యాటక శాఖ డైరెక్టర్ ఎల్. రంజీత్ నాయక్ (ఐఎఫ్ఎస్), అసిస్టెంట్ డైరెక్టర్ ఓం ప్రకాష్, టీజీటీడీసీ జనరల్ మేనేజర్ ఎన్. మన్వి జగన్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు, అంతర్జాతీయ పర్యాటక రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

పెవిలియన్‌లో ప్రత్యేక ఆకర్షణలు:

ప్రపంచ వారసత్వ సంపద - చారిత్రక వైభవం
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, గోల్కొండ కోట మరియు చార్మినార్‌ల వైభవాన్ని తెలిపే చిత్రాలు, డిజిటల్ ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆధ్యాత్మిక, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు
నాగార్జునసాగర్, ఆసియాలోనే ప్రసిద్ధి గాంచిన బుద్ధవనం, కాళేశ్వరం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, బౌద్ధ క్షేత్రాలను అంతర్జాతీయ యాత్రికులకు పరిచయం చేశారు.

ప్రకృతి సౌందర్యం, ఎకో-టూరిజం
లక్నవరం సరస్సు, బొగత జలపాతం, అనంతగిరి కొండలు వంటి సుందర పర్యావరణ-పర్యాటక ప్రాంతాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేలా స్టాళ్లను తీర్చిదిద్దారు.

హస్తకళలు, చేనేత మరియు తెలంగాణ రుచులు
రాష్ట్ర సంప్రదాయ చేనేతలు, ప్రసిద్ధ హస్తకళా రూపాలు, సాంస్కృతిక విశేషాలతో పాటు ప్రత్యేకమైన తెలంగాణ ఆహార సంస్కృతిని స్టాల్‌లో ప్రదర్శించారు.

గ్లోబల్ మైస్ (MICE) హబ్‌గా హైదరాబాద్
చారిత్రక విశేషాలతో పాటు అంతర్జాతీయ సమావేశాలు, ఎగ్జిబిషన్లు (MICE), ప్రపంచస్థాయి వైద్య పర్యాటకం (మెడికల్ టూరిజం), వినోదం, షాపింగ్ హబ్‌గా హైదరాబాద్ నగర ప్రాధాన్యతను విదేశీ ప్రతినిధులకు వివరించారు.

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ ప్రదర్శన ఎంతో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.