BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు

Select Suryaa Now
 శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి  విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : చాత్తాద శ్రీ వైష్ణవులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మాచవరం వెంకటేశ్వర్లు అధ్యక్షతన 'రామానుజ సంక్షేమ పరిషత్' ప్రత్యేక సమావేశం రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి రామానుజాభిలాషికల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ బెల్లంకొండ పద్మావతి, ప్రముఖ న్యాయవాది 
వకుళాభరణం వేణుమాధవ్, వెంకటేశ్వర కళ్యాణ వేదిక ప్రెసిడెంట్ నరసింహులు, బోధనం పరాంకుశం, మహిళా బలగం రాధ, గోపిధర్, ప్రముఖ న్యాయవాదులు రామానుజం ప్రకాష్, ఎల్బీనగర్ అధ్యక్షులు కురుపతి శ్రీనివాస్, కాంతారావు, నరసింహస్వామి, రాష్ట్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి రమణ, లక్ష్మణ స్వామి, తిరునగరి శ్రీనాథ సూరి తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు సంఘ నిర్మాణంలో చాత్తాద శ్రీ వైష్ణవ కులంలో నెలకొన్న సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కులాన్ని మరింత అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి ఐకమత్యంతో పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర సంఘంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రామానుజ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక కులాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, సంఘ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించాలని కోరారు.