మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, మేజర్ న్యూస్: లైయన్స్ క్లబ్ ఆఫ్ సనత్నగర్ ఆధ్వర్యంలో మోతీనగర్ కమ్యూనిటీ హాల్ నందు మధుమేహ (డయాబెటిస్) వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రత్యేక అవగాహన పోస్టర్ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు.సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న మధుమేహం పట్ల ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన జీవనశైలి, సమతుల్య ఆహారం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని లైయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడానికే ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వివరించారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో లైయన్స్ క్లబ్ ప్రతినిధులు లైన్ లోకా రాజు, లైన్ డాక్టర్ ప్రఫుల్ల రెడ్డి, లైన్ తిరుపతి రెడ్డి, లైన్ కోటి రెడ్డి, లైన్ హనుమంత్ నాయుడు, లైన్ రమేష్ రెడ్డి, రంగా రావు స్థానిక ప్రముఖులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.