BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

Select Suryaa Now
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సూర్య న్యూస్ డెస్క్, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల అభ్యున్నతి, బీసీ విద్యార్థుల సంక్షేమం మరియు రాబోయే జనగణనలో కుల గణనను చేర్చడంపై సమగ్రంగా చర్చించి పలు కీలక విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు.

బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం నుండి తగినంతగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అలాగే బీసీ సంక్షేమ పాఠశాలలు, గురుకులాలు, డిగ్రీ కళాశాలలకు శాశ్వత నూతన భవనాల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ప్రస్తావించిన ప్రధాన డిమాండ్లు:

పారదర్శకంగా బీసీ కుల గణన
రాబోయే దేశవ్యాప్త జనగణన (సెన్సస్) ఫారంలో ప్రత్యేకంగా ఓబీసీ (OBC) కాలమ్‌ను చేర్చి, బీసీల సమగ్ర జనాభా లెక్కలను అత్యంత పారదర్శకంగా సేకరించాలని డిమాండ్ చేశారు. తద్వారా జనాభా దామాషా ప్రకారం విద్య, ఉపాధి, బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రధాని, హోం మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి
ఈ కీలకమైన అంశాలను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.

ఈ ప్రతినిధి బృందంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డిపల్లి రఘుపతి, నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు తెలిపారు.