నేడే " పల్లె " పోరు
ఎమ్మిగనూరు, సూర్య న్యూస్ ప్రతినిధి
నిన్నటి వరకు పుర పోరు.. ఫలితాలు వెలుబడటం పట్టణంలో ఎన్నికల వేడి తగ్గింది..
ఇక అధికారులకు పోలీసులకు విరామం లేకుండా పల్లె పోరు రమ్మంది.. బ్యాలెన్స్ బాక్స్ పెట్టుకొని.. ఎన్నికల అధికారులు పల్లెల్లో వాలి పోయారు.. ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల నేటి ఉదయం ఏడు గంటల నుండి పల్లె పల్లెన పోలింగ్ నిర్వహించనున్నారు.. ఎమ్మిగనూరు మండలంలో 24 ఎంపీటీసీలు గోనెగండ్ల మండలంలో 21 ఎంపీటీసీ నందవరం మండలంలో 17 ఎంపీటీసీలు తోపాటు మూడు మండలాలకు మూడు జడ్పిటిసి స్థానాల ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మిగనూరు డిఎస్పి శ్రీనివాసులు, సిఐ చిరంజీవి ఎస్ఐలు తిమ్మారెడ్డి, శ్రీనివాసులు తో పాటు పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు.
A. R. శరత్ కుమార్
సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా