BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్

Select Suryaa Now
సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు మేజర్ న్యూస్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గ్రామ, మండల అభివృద్ధికి సహకరించాలని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ కాటూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉయ్యూరు మండలం కాటూరులో కూటమి అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించి, అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న వేమూరి శ్రీనివాస్‌ను ఎంపీటీసీగా గెలిపిస్తే ఎంపీపీగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. రెండో ఎంపీటీసీ స్థానానికి యుగ బాబును, జడ్పీటీసీ స్థానానికి కంభం రమేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షుడు రామినేని కుటుంబయ్య, టీడీపీ నాయకులు జంపన వీర శ్రీనివాస్, తెలుగు యువత అధ్యక్షుడు కోడి హరీష్, నేరెళ్ల గుప్త తదితరులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.