ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 41మంది విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ఛైర్మన్ మన్నెం రామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఓ ప్రముఖ ఐటీ సంస్థ ప్రతినిధులు కళాశాలలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు విశేష స్పందన లభించిదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కళాశాల లక్ష్యమని పేర్కొనారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కంపెనీ ప్రతినిధి ముత్తుస్వామి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ వాసు, ప్లేస్మెంట్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్