డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ
అరకులోయ, నవంబర్ 3, మేజర్ న్యూస్:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినీ,విద్యార్థులు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా నీటి సంరక్షణపై అవగాహన కల్పించిన అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు బ్రిక్స్ సుస్థిర జీవన విధాన వారంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు నేతృత్వంలో నిర్దేశిత అంశమైన నీటి సంరక్షణ,వనరుల పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావుమాట్లాడుతూ నీటి విలువ భవిష్యత్తు తరాలకు చాలా ముఖ్యమన్నారు.నీటి సరఫరా వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలను అరికట్టడం మన బాధ్యత అని ఆయన చెప్పారు.ప్రతి విద్యార్థి, కళాశాల సిబ్బంది నీటి వృథాను అరికట్టడంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓలు డాక్టర్ జి.సుధీర్,వై.విజయలక్ష్మి, బి.లచ్చన్న మాట్లాడుతూ నీరనేది కేవలం మన కోసమే కాదని,భావి తరాల వారు కూడా బతకడానికి అవసరమైన
జీవనాధారమన్నారు.మనమంతా నీటిని కాపాడుకుంటేనే, భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.నిర్మల, అధ్యాపకులు భాస్కర్, రమ్యశ్రీ,కుమార్, రాజు,సోంబాబు, అప్పారావు,కామేష్, సుమిత్ర,అంబికా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.