విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్
విద్యార్థుల సంక్షేమానికి కృషి...
-సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్
బెజ్జంకి/మేజర్ న్యూస్:
విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తానని సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ అన్నారు.మండల పరిధిలోని గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం బూట్లు,సాక్స్,బెల్టులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండ పాఠశాలకు హాజరై శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.విద్యార్థుల అభివృద్ధి కోసం అవసరమైన సహాయం అందిస్తామన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచు యాలాల పర్శరాములు,ప్రధానోపాధ్యాయురాలు రేవతి,ఉపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు.