BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

కూచిపూడి నృత్యంలో 12 ప్రపంచ రికార్డులు సాధించిన కుమారి రుంకు వైష్ణవి

Select Suryaa Now
కూచిపూడి నృత్యంలో 12 ప్రపంచ రికార్డులు సాధించిన కుమారి రుంకు వైష్ణవి

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : స్పందన నృత్యకేళి స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి నృత్య గురువు డా. ఎన్. రవికుమార్ నిర్వహణలో పియర్సన్ స్కూల్ వేదికగా “గణ నృత్యం” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 12 సంవత్సరాల చిన్నారి రుంకు వైష్ణవి ఏకధాటిగా 12 గంటల పాటు నిర్విరామంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరినీ అబ్బురపరిచింది. 122 భంగిమలు, 522 పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ తన అసాధారణ ప్రతిభను చాటుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో వైష్ణవి 12 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. 

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు, ప్రపంచ రికార్డుల నేషనల్ కో-ఆర్డినేటర్ లయన్ కె.వి. రమణారావు, మిస్ గార్జియస్ ఇండియా 2026 టైటిల్ విన్నర్ ప్రపంచ రికార్డుల జ్యూరీ సభ్యులు అలిసియా జోసెఫ్, రాష్ట్ర ప్రతినిథి దండు ఉషశ్రీ వపాల్గొని వైష్ణవి అద్భుత నృత్య ప్రదర్శనను వీక్షించి ఆమెకు 12 ప్రపంచ రికార్డుల గుర్తింపు పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి , జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు టీటీడీ బోర్డు సభ్యులు బొంగూరి మహేందర్ రెడ్డి పాల్గొని చిన్నారి వైష్ణవి ప్రతిభను, గురువు డా. ఎన్. రవికుమార్ కృషిని అభినందించి ప్రసంగించారు. కేవలం 12 సంవత్సరాల వయసులో ఏకధాటిగా 12 గంటల పాటు కూచిపూడి నృత్యం చేయడం ఎంతో విశేషమని వైష్ణవి సాధన, పట్టుదల, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సంప్రదాయ కళకు సరికొత్త గుర్తింపుగా కూచిపూడి వైభవానికి ప్రపంచ వేదికపై మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.