ఆమె విజయం.. భారతదేశం గర్వించే విజయం..: భారత్‌కు తొలి పతకం సాధించిన ధినిధి దేశింగు.
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : భారత స్విమ్మింగ్ చరిత్రలో ధినిధి దేశింగు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 16 ఏళ్ల ఈ బెంగళూరుకు చెందిన స్విమ్మర్ దకార్ 2026 యూత్ ఒలింపిక్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. 56.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని జాతీయ రికార్డు నెలకొల్పింది. యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనతను సొంతం చేసుకుంది. ధినిధి విజయం యావత్ దేశానికి గర్వకారణమని ఆమెకు మద్దతుగా నిలుస్తున్న బజాజ్ ఫిన్‌సర్వ్ పేర్కొంది. సోమవారం దకార్‌లో జరిగిన ఫైనల్ పోటీలో 56.27 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించి కాంస్య పతకం సాధించింది. క్రొయేషియాకు చెందిన అనా బోబనోవిచ్ 55.89 సెకన్లతో స్వర్ణ పతకం, న్యూజిలాండ్‌కు చెందిన అలిస్సా లాసన్ 56.13 సెకన్లతో రజత పతకం గెలుచుకున్నారు.
యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళా స్విమ్మర్‌గా కూడా ధినిధి మరో ఘనత సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే బజాజ్ ఫిన్‌సర్వ్ ధినిధికి మద్దతు ప్రకటించింది. బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రెసిడెంట్ మనవ్ మియాన్‌వాల్ మాట్లాడుతూ..“ధినిధి సాధించిన చారిత్రాత్మక కాంస్య పతకం భారతదేశానికి గర్వకారణం. పెద్ద కలలు కనే ప్రతి యువ క్రీడాకారుడికి ఆమె విజయం స్ఫూర్తినిస్తుంది. ఈ పతకం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, త్యాగం, అసాధారణమైన పట్టుదల ఉన్నాయి. వ్యక్తిగత ప్రతిభకు సమష్టి మద్దతు తోడైతే భారత క్రీడాకారులు ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడగలరని ఆమె నిరూపించింది. భారత్‌లో కొన్ని క్రీడలకు మాత్రమే విస్తృత గుర్తింపు, ఆర్థిక వనరులు లభిస్తున్నాయి. అయితే ప్రతిభ ఉన్న అనేక మంది యువ క్రీడాకారులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన మద్దతు అందడం లేదు.
అలాంటి వారికి కెరీర్ ప్రారంభ దశలోనే అండగా నిలవడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించి, క్రీడాకారులు తమ శిక్షణ, అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు బజాజ్ ఫిన్‌సర్వ్ సహకరిస్తోంది. స్విమ్మింగ్‌లో ధినిధి తొలి క్రీడాకారిణి కాగా, భవిష్యత్తులో మరికొందరు యువ స్విమ్మర్లకు కూడా మద్దతు అందించాలని బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రణాళిక రూపొందించింది. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ క్రీడల్లో దీర్ఘకాలికంగా యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సంస్థ కృషి చేస్తోంది. ఈ క్రీడల్లో యువ ప్రతిభావంతులకు నాణ్యమైన కోచింగ్, శిక్షణ సదుపాయాలు, పోటీల్లో పాల్గొనే అవకాశాలు, క్రీడా పరికరాలు, పోషకాహారం, ఫిట్‌నెస్ సహకారంతో పాటు ప్రయాణ, వసతి ఖర్చుల విషయంలోనూ బజాజ్ ఫిన్‌సర్వ్ మద్దతు అందిస్తోంది. ధినిధి సాధించిన చారిత్రాత్మక పతకం ప్రతిభ, పట్టుదల, నిరంతర మద్దతు కలిస్తే ఎలాంటి విజయాలైనా సాధ్యమవుతాయని మరోసారి నిరూపించింది. అని అన్నారు