తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేత నలగాటి ప్రసన్న రాజు
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో మంగళవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ నలగాటి ప్రసన్న రాజు హాజరయ్యారు. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను నలగాటి ప్రసన్న రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన అంశాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై నాయకుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో జగదీశ్ రెడ్డితో కలిసి పాల్గొన్న నలగాటి ప్రసన్న రాజు అనంతరం కేటీఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.