ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
అరకులోయ, నవంబర్ 3, మేజర్ న్యూస్:అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఎన్నికల శిక్షణా శిబిరాన్ని మంగళవారం సందర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణా తరగతులను ఆమె సందర్శించి పలు కీలక సూచనలు చేశారు. అరకులోయ మండల
ఎంపీటీసీ,జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి అక్కడ చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు.ప్రధానంగా బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్, మార్క్డ్ కాపీల భద్రపరచడం,స్ట్రాంగ్ రూమ్ ,కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.ఈ ఏర్పాట్లను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదంశెట్టి.శ్రీధర్, సహాయ ఎన్నికల అధికారి-1,ఎంపీడీవో వీసం. ప్రసాద్,సహాయ ఎన్నికల అధికారి–2, తహసీల్దార్ గుంటూరు రాజా శ్రీధర్, మండల విద్యాశాఖ అధికారిణి ప్రధాని.భారతి రత్నం,ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైడితల్లి, సర్వేయర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.