BREAKING
పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన

Select Suryaa Now
మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా వర్సిటీ అంతర్జాతీయ బ్రిక్స్ కార్యక్రమంలో భాగంగా వ్యాపార నిర్వహణ విభాగం, జాతీయ సేవా పథకం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జల సంరక్షణ ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగపూర్ ప్లానెట్‌వైజ్ ప్రైవేట్ లిమిటెడ్, సహ వ్యవస్థాపకులు సంచాలకులు అనిల్ కాంచి, గౌరవ అతిథులుగా ప్రొఫెసర్ ఐ.వి. లలిత కుమారి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తప్రొఫెసర్ మద్దూరు నీరజ, విద్యార్థి వ్యవహారాల సంచాలకులు ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం నీటి సంరక్షణ ఆవశ్యకత, నీటి వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నీటిని పొదుపుగా వినియోగిస్తూ, భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వర్షపు నీటి ఇంకుడు గుంతల శుభ్రత కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గుంతల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు. వర్షపు నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమిలోకి ఇంకేందుకు ఇంకుడు గుంతలను శుభ్రపరచడం ఎంత ముఖ్యమో ఆచరణాత్మకంగా తెలుసుకున్నారు. దీని ద్వారా భూగర్భ జలాల పెంపుదలలో వర్షపు నీటి సంరక్షణ పాత్రను అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డా.వై.సునీత, డా.వి.భార్గవి రెడ్డి, డా.హేమావతి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్