ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన, చట్టపరమైన చర్యలు అనే అంశంపై మంగళవారం విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పద్మావతమ్మ మాట్లాడుతూ కళాశాలలో తిరుపతి పోలీసులు, ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు మాదక ద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ, రోడ్డు భద్రత, మహిళలపై జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్, వంటి విషయాలపై అవగాహన కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది వెంకటేశర్లు, పోలీసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్