రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : వెస్ట్ కాకతీయనగర్‌లో రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, బీజేపీ, బీఆర్ ఎస్ నాయకులతో కలిసి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్కాజిగిరి నియో జకవర్గంలో అన్ని డివిజన్ లను సమానంగా అభివృద్ధి చేస్తు న్నట్లు చెప్పారు. వివిధ మురికి వాడలు, కాలనీలలో నెలకొ న్న సమస్యల ప్రాధాన్యత బట్టి అభివృద్ధి పనులను త్వరిత గతిన చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమ మే తన ఏకైక ధ్యేయమన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షే మ పథకాల ఫలాలు ప్రజల దరిచేర్చడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. వినాయక్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ..తన ఐదేళ్ల పదవీ హయంలో వినాయక్ నగర్ డివిజన్ సమగ్రాభివృద్ధికి శాయశక్తులా పని చేశానని చెప్పారు. ఈరోజు వెస్ట్ కాకతీయనగర్ కాలనీలో నూతనంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభం కావటం తనకెంతో సంతో షంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమా ణాలను పాటిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి, ప్రజ లకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆమె అధికారు లను, కాంట్రాక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ సత్య లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు ఓంప్రకాష్, జగదీశ్ చారి, జ్యోతిర్మయి, శృకేశ్, ప్రశాంత్, మల్లేష్, రాములు, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాంరెడ్డి, అమీనుద్దీన్, భాగ్యానంద్ రావు, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, హేమంత్ పటేల్, ప్రభాకర్, తులసీ సురేష్, చంద్రమౌళి, మల్లేశ్ చారి, బాలకృష్ణ, విజయ్ రెడ్డి, సర్వేష్ యాదవ్, సుబ్బారెడ్డి, సాయిప్రసాద్, వినీత్, కాలనీ వాసులు తిప్పారెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.