BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి....

Select Suryaa Now
మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి....

.                                  టిఆర్ఎస్  గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
మియాపూర్,మేజర్ న్యూస్ : మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న భూములను అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, నిరుపేదలకు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇటీవల సుప్రీంకోర్టు ఈ సర్వే నంబర్లలోని భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సుమారు 15 వేల పేద, నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారి భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.ముఖ్యంగా ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, పీఏ నగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు. 

ఇప్పటికే నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లబోమని కలెక్టర్ ప్రకటిస్తుండగా, మరోవైపు ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్న భూములతో పాటు మొత్తం 550 ఎకరాల భూములను విక్రయిస్తామని ప్రకటించడం ప్రజల్లో అయోమయాన్ని, భయాందోళనలను సృష్టిస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 

ఈ భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయించకుండా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ఉద్యమకారులకు, ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాలని సూచించారు.
ఈ భూములు కేవలం ప్రభుత్వ ఆస్తులుగా కాకుండా పేద ప్రజల జీవనాధారంతో ముడిపడి ఉన్న అంశమని, వారి హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ ప్రసాద్ కోరారు. ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, పీఏ నగర్, ప్రశాంత్ నగర్ నివాసితులకు అన్యాయం జరిగితే తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పేదల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు గూడ లావణ్య, విష్ణు చారి, కుమార్ యాదవ్, సుజాత, ప్రవీణ్ బిజిలి, శ్రీనివాస్ నేత, సందీప్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.