BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

Select Suryaa Now
గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):హైదరాబాద్ నగరానికి గండిపేట (ఉస్మాన్‌సాగర్) నుంచి తాగునీటిని సరఫరా చేసే వందేళ్లకు పైగా పురాతనమైన రాతి నిర్మాణ కాండ్యూట్‌పై లీకేజీల మరమ్మతు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల్లో ఏర్పడిన లీకేజీలను అరికట్టేందుకు జలమండలి నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 20 ఎంజీడీల సామర్థ్యం గల కాండ్యూట్‌పై మరమ్మతు పనులను అధికారులు వేగవంతం చేశారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే పనులు పూర్తి చేసి, ప్రభావిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ శ్రీ కె. అశోక్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. వందేళ్లకు పైగా పురాతనమైన కాండ్యూట్ కావడంతో మరమ్మతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శాశ్వత పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

నగరానికి వివిధ జలవనరుల నుంచి ప్రతిరోజూ దాదాపు 560 ఎంజీడీల తాగునీరు సరఫరా అవుతుండగా, ప్రస్తుత షట్‌డౌన్ కేవలం గండిపేటకు సంబంధించిన 20 ఎంజీడీల కాండ్యూట్‌కు మాత్రమే పరిమితమని జలమండలి స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి, సింగూరు–మంజీరా తదితర ఇతర జలవనరుల నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది.

మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి వెల్లడించింది. అప్పటివరకు వినియోగదారులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.