యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: యాదగిరి నగర్‌లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీవరేజ్ పనులు ప్రారంభమయ్యాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ నాయకత్వంలో ఏజీ కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్ బస్తీ దవాఖాన సమీపంలో రూ.10.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పనులను కాంగ్రెస్ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏజీ కాలనీ డివిజన్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు. సీవరేజ్ సమస్యల పరిష్కారంతో స్థానికులకు ఇబ్బందులు తొలగనున్నాయని వారు పేర్కొన్నారు.