BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు

Select Suryaa Now
నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు

                                        పాని యాప్ ద్వారా నీటి వృథా, దుర్వినియోగంపై ఫిర్యాదు చేసే అవకాశం
                                     ప్రతి ఇంట్లో కనీసం 20 శాతం నీటిని పొదుపు చేయాలని జలమండలి పిలుపు

హైదరాబాద్ మేజర్ న్యూస్ ( సిటీ ప్రతినిధి):తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టి నీటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు జలమండలి ప్రవేశపెట్టిన PAANI (పానీ) యాప్‌కు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 437 మంది స్వచ్ఛందంగా జలమండలి వెబ్‌సైట్ ద్వారా వాటర్ వారియర్లుగా నమోదు చేసుకున్నారు.

నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి పౌరుడు జలమండలి వెబ్‌సైట్‌లో సేవ్ వాటర్ వాలంటీర్‌గా నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి PAANI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పరిసరాల్లో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని గుర్తించి ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా తాగునీటితో వాహనాలు, ఫ్లోర్లు కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, ఇతర రూపాల్లో నీటిని వృథా చేయడం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.

వాలంటీర్ల ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి దుర్వినియోగం నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

రాబోయే ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. ప్రతి కుటుంబం తమ రోజువారీ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని, నీటి లీకేజీలను అరికట్టడంతో పాటు తాగునీటిని అనవసర అవసరాలకు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ, నివాస సముదాయం నుంచి ఎక్కువ మంది వాటర్ వారియర్లుగా ముందుకు రావాలని జలమండలి కోరింది. ప్రజల భాగస్వామ్యంతోనే నీటి వృథాను సమర్థవంతంగా అరికట్టగలమని, ప్రతి పౌరుడు PAANI యాప్‌ను వినియోగించి నీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చింది.