BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు.

Select Suryaa Now
గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు.

గచ్చిబౌలి,మేజర్ న్యూస్ :  గోపీనగర్‌ బీసీ హాస్టల్‌ సమీపంలో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రాంతమంతా చీకటిమయంగా మారుతోంది. ఇదే అదనుగా కొందరు యువకులు సమీపంలోని చెట్లు, రాళ్ల ప్రాంతాల్లో గంజాయి సేవించడం, సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ ప్రాంతంలో మహిళలు, చిన్నపిల్లలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, చీకటి కారణంగా వారి భద్రత పై ఆందోళన నెలకొందని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బాధ్యత ఎవరిదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.గోపీనగర్‌ బీసీ హాస్టల్‌ పరిసరాల్లో వెంటనే వీధి దీపాలను పునరుద్ధరించాలని, రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.