BREAKING
ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ... విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన స్మార్ట్ వాచ్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుందా: హార్ట్ రేట్ నుంచి నిద్ర వరకు అసలు నిజాలు ఇవే డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ ఆమె విజయం.. భారతదేశం గర్వించే విజయం..: భారత్‌కు తొలి పతకం సాధించిన ధినిధి దేశింగు. సురక్షిత ప్రాంతానికి అంగన్వాడీ పిల్లలు!

గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

Select Suryaa Now
గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పీఠాన్ని ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. నగరంలోని మొత్తం 76 డివిజన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి క్లీన్ స్వీప్ దిశగా విజయం సాధించారు.

మొత్తం 76 డివిజన్ల వివరాలు చూస్తే.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అత్యధికంగా 48 స్థానాల్లో గెలుపొందగా, జనసేన పార్టీ 13, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 3 డివిజన్లను గెలుచుకున్నాయి. దీంతో ఎన్డీయే కూటమి బలం 64కి చేరి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేవలం 11 స్థానాలకే పరిమితమవ్వగా, ఇతరులు ఒక చోట విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఫలితాలు స్పష్టమవ్వడంతో గుంటూరు నగరంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. నగర నలుమూలలా పటాకులు కాలుస్తూ, విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు సమగ్ర అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఇది అని కూటమి నాయకులు కొనియాడారు.