BREAKING
నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ... విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన స్మార్ట్ వాచ్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుందా: హార్ట్ రేట్ నుంచి నిద్ర వరకు అసలు నిజాలు ఇవే డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ

ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు

Select Suryaa Now
ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు
  • కాపు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు

విశాఖపట్నం, సూర్య: జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి అఖండ విజయం సాధించడంతో కాపు సేన నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆమె విజయాన్ని పురస్కరించుకుని కాపు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సీతమ్మధారలోని కాపు సేన కార్యాలయంలో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎన్. మూర్తి మాట్లాడుతూ ముక్కా శ్రావణి విజయం విశాఖ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఆమెకు లభించిన ప్రజా మద్దతు, విజయం పట్ల కాపు సామాజిక వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కాపు సేన జనరల్ సెక్రటరీ లంకా భాస్కరరావు, దాసరి రాధాకృష్ణ, టి. చంద్రమౌళేశ్వరరావు, పోతు మహేష్, గుర్రాల శ్రీనివాస్, మద్దింశెట్టి సురేష్, మోకా నాని, రాయల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషశ్రీ, యడ్లపల్లి కళ, కోవా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.