BREAKING
నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ... విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన స్మార్ట్ వాచ్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుందా: హార్ట్ రేట్ నుంచి నిద్ర వరకు అసలు నిజాలు ఇవే డిగ్రీ కళాశాలలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ

టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు  బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా 7వ మహాసభలు కట్టంగూర్ మండల కేంద్రంలోని బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్‌లో ఉత్సాహపూరిత వాతావరణం లో ఘనంగా జరిగాయి. ఈ సమావేశంలో 2026-2028 కాలానికి సంబంధించిన నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కట్టంగూర్ మండలానికి చెందిన పుట్ట రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యదర్శి పుట్ట రాములు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నూతన కమిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతా నికి నిరంతరం కృషి చేస్తామని పిలుపునిచ్చారు. ఉపాధ్యా యుల న్యాయమైన హక్కుల సాధనకు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టీఎస్‌ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేందు కు అందరూ ఐక్యంగా శ్రమించాలని కోరారు. కాగా నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పుట్ట రాములుది మండలంలోని బొల్లేపల్లి గ్రామం. ప్రస్తుతం ఆయన దుగినేవల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవాలందిస్తున్నారు. గతంలో ఆయన కట్టంగూర్, శాలిగౌరారం మండలాలకు టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడిగా వరుసగా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించి, సంఘ బలోపేతానికి విశేష కృషి చేశారు. జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల పలువురు ఉపాధ్యాయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు ఆయనను అభినందించారు.