BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు....

Select Suryaa Now
వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న  సూర్యాపేట జిల్లా పోలీసులు....

 

సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్

మురుసు తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సూర్యాపేట జిల్లా పోలీసులు ప్రజాభద్రత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా రహదారులపై విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. వర్షం కురిసినా.. వాతావరణం ఎలా ఉన్నా.. ప్రజల రక్షణే మా బాధ్యత.. ప్రజాభద్రతే మా ప్రథమ కర్తవ్యం అనే సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు, భద్రతా తనిఖీలు చేపడుతున్నారు.
తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, కూడళ్లు, సరిహద్దు ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు నేరస్తులు, అనుమానిత వ్యక్తుల సంచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోకి అక్రమ వస్తువులు, నిషేధిత పదార్థాలు ప్రవేశించకుండా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
అదేవిధంగా వర్షాల కారణంగా రహదారులు జారుడుగా మారడం, రహదారులపై నీరు నిలవడం, వాహనాల నియంత్రణ కోల్పోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు అతివేగంగా వెళ్లకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

ప్రజలకు పోలీసుల భరోసా:

ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు రక్షణగా ఉంటుందని పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది.  ప్రకృతి ప్రతికూలించినా.. ప్రజల రక్షణ విషయంలో పోలీసులు వెనకడుగు వేయరనే సందేశాన్ని వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది  చాటి చెప్తున్నారు.