BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే

Select Suryaa Now
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..!  -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు  -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :

చంద్రగిరి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల వేళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 5న ఆరు మండలాల పరిధిలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ పోలింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని నిరంతరాయంగా వీడియో రికార్డింగ్‌ చేయాలని స్పష్టం చేసింది. కేంద్రాల లోపల, వెలుపల నమోదైన దృశ్యాలను భద్రపరిచి హైకోర్టుకు సమర్పించాలని సూచించింది.

నామినేషన్ల నుంచి న్యాయపోరాటం వరకు..

చంద్రగిరి నియోజకవర్గంలో నామినేషన్ల సమయంలో తమ పార్టీ అభ్యర్థులపై అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధారాలతో సహా న్యాయపోరాటం సాగించారు. పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని, రిగ్గింగ్ కు అవకాశం లేకుండా చూడాలని హైకోర్టును అభ్యర్థించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలన్న అంశాన్ని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ మొత్తాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రతి కదలిక కెమెరా నిఘాలోనే..

పోలింగ్‌ కేంద్రాల లోపల, వెలుపల జరిగే పరిణామాలు వీడియోల్లో నమోదుకానుండటంతో ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు అవకాశం ఏర్పడింది. రికార్డింగ్‌ దృశ్యాలను భద్రపరచి న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉండటంతో ఎన్నికల విధుల్లో ఉన్న యంత్రాంగంపై బాధ్యత మరింత పెరగనుంది.

ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోండి

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Dwaraka, staff reporter 

9705347341.