అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం...
ఎల్లమ్మ ఆలయానికి భక్తుల రద్దీ...
భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్దగల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక పూజలు, కుంకుమార్చన, అమ్మవారికి చీర సారె ,ఒడిబియ్యం , పసుపు కుంకుమలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మరి కొంతమంది భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని కోరుతూ అమ్మవారికి ముడుపులు కట్టారు. ఆలయం ముందున్న శివుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలతో డప్పు చప్పులు నడుమ ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఇష్టమైన బోనం ను నైవేద్యంగా సమర్పించుకున్నారు. ఇది ఇలా ఉంటే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరు పాల్గొన్నారు.