కన్య రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
కన్యా రాశి… ప్రారంభంలో ఆశించిన పనులు ముందుకు వెళతాయి. తోబుట్టువులు, మిత్రులు సహకరిస్తారు, నెట్వర్క్ అనుకూలిస్తుంది. భూ వ్యవహారాలు, కమ్యూనికేషన్, వారసత్వ అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉత్సాహం, పరాక్రమం పెరుగుతుంది. వారం మధ్యలో ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రవచనాలపై ఆసక్తి, గురువుల కలయిక, పుణ్యక్షేత్ర సందర్శన, స్థిరాస్తి వ్యవహారాల కొరకు ఖర్చులు, దూర ప్రయాణాలు. నిద్రలేమి, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. విరాళాలు. వారాంతం వ్యాపార వ్యవహా రాలు చర్చలు. ఆర్థిక నిర్ణయాలలో, కుటుంబ వ్యవహారాలలో సభ్యుల మధ్య అహం సమస్యలు లేకుండా ఆలోచనలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తండ్రి పెద్దల ఆరోగ్య శ్రద్ధ. ఆత్మీయుల సలహాలు సమయస్ఫూర్తి నిర్ణయాలు ఉపకరిస్తాయి. అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.