చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు
భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:
భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు జోగు శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారము పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు ఆసుపత్రికి వెళ్లి బాధితుడు జోగు శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఏజాస్ రుద్ర చంద్రప్రకాష్ పెద్దల సుధాకర్ తదితరులు ఉన్నారు.