BREAKING
దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు జడ్పిటిసి స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవాసం. ప్రతి గడపనా ఆనంద దీపాలు వెలగాలి! తిరుపతి రూరల్ జెడ్పిటిసిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గుడిపల్లి జడ్పీటీసీగా మంజుప్రియ వెంకటేష్ ఘన విజయం నల్గొండ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్.. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలి! రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించిన కట్టంగూర్ కాంగ్రెస్ నాయకులు! నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు జడ్పిటిసి స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవాసం.

Select Suryaa Now
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు జడ్పిటిసి స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవాసం.

కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల జడ్పీటీసీ స్థానాల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ నమోదు చేశారు. కంబదూరు జడ్పీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వేముల శారద 7,336 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి ఐదు మండలాల్లో అత్యధిక మెజార్టీ నమోదు చేశారు. కళ్యాణదుర్గం మండలంలో టీడీపీ అభ్యర్థి బోయ లక్ష్మి వెంకటేశులు 6,132 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బ్రహ్మసముద్రం మండలంలో పాలబండ్ల శ్రీరాములు 2,560 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. శెట్టూరు మండలంలో టీడీపీ అభ్యర్థి ఉరాల రాజేశ్వరి 1,666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, కుందుర్పి మండలంలో జి.ఎల్. ప్రభావతి 1,050 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఐదు మండలాల్లోనూ తమ అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. విజయం సాధించిన అభ్యర్థులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మొత్తంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలూ టీడీపీ బలపరిచిన అభ్యర్థుల ఖాతాలో చేరడంతో స్థానిక రాజకీయాల్లో ఈ ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-  బోయ రంగస్వామి.