రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!!
రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!!
స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండల జడ్పిటిసి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బై నేని శిరీష అఖండ మెజారిటీతో కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచి 13వేల ఐదు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి తన రాజకీయ సత్తాను చాటుకున్నారు. భారీ మెజారిటీ అందించినందుకు ప్రజలకు, ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు ,పరిటాల శ్రీరామ్ కు టిడిపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు, ముత్యాలు, లక్ష్మీనారాయణ రెడ్డి, గుర్రం శ్రీనివాసులు, మారుతి ప్రసాద్, విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య