BREAKING
మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో సేవా సందడి.. --రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ దంపతులు --కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు ఎన్విడియా సంక్షోభం...చైనా టెక్ రంగానికి లాభం కంటే నష్టమే ఎక్కువ

ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లో ఒకరు మృతి

Select Suryaa Now
ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లో ఒకరు మృతి

*ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌లో మృతి*

*రెండు బైకులు ఎదురెదురుగా ఢీ.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు*

*మృతుడు కడప జిల్లా బి.కోడూరు మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!**

*167బీ జాతీయ రహదారిపై ఉప్పలపాడు స్టేజి వద్ద ప్రమాదం*

**సీఎస్‌పురం:** ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎస్‌పురం మండలం ఉప్పలపాడు స్టేజి సమీపంలోని మైదుకూరు–సింగరాయకొండ 167బీ జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కడప జిల్లా బి.కోడూరు మండలం హైత్రంపేటకు చెందిన 23 ఏళ్ల కొండా వెంకటసుబ్బారెడ్డి ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మృతిచెందారు. ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన వెంకటసుబ్బారెడ్డి వివాహితుడు కావడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

అతనితో ఉన్న మామ సిద్ధారెడ్డికి కాలు విరగగా.. సీఎస్‌పురానికి చెందిన డ్రైవర్ పాశం వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి. వెంకటేశ్వరరెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. పాశం వెంకటేశ్వర్లును ఒంగోలు తరలించగా.. సిద్ధారెడ్డిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

రెండు బైకుల ఢీకొన్న ఘటనలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోవడంతో హైత్రంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి