BREAKING
శ్రీ మఠంలో దీపావళి వేడుకలు దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో సేవా సందడి.. --రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ దంపతులు --కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవ కార్యక్రమాలు

Select Suryaa Now
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవ కార్యక్రమాలు

 

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో 

కార్తీక మాసం – 2026 ఉత్సవ కార్యక్రమాలు

తేదీ: 09.11.2026 నుండి 08.12.2026 వరకు

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 09.11.2026 నుండి 08.12.2026 వరకు పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహన సేవలు, గ్రామోత్సవాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడును. కార్యక్రమాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. 08.11.2026 – ఆదివారం

- ఉదయం 7.00 గంటలకు శ్రీ కేదారీ గౌరీ వ్రతం.
- సాయంత్రం అమావాస్య సందర్భంగా నాలుగు మాడ వీధులలో ఉత్సవం.

2. 09.11.2026 నుండి 08.12.2026 వరకు

- ప్రతిరోజూ ఆకాశదీపం కార్యక్రమం నిర్వహించబడును.

3. 09.11.2026 – మొదటి కార్తీక సోమవారం

- సాయంత్రం నాలుగు మాడ వీధులలో ఉత్సవం.

4. 11.11.2026 – బుధవారం

- రాత్రి పెద్ద నంది సేవ.- సేవా రుసుము: రూ.80,000/-.

5. 13.11.2026 – శుక్రవారం (నాగుల చవితి)

- ఉదయం 7.00 గంటలకు సూర్యుని గుడి వద్ద నాగుల పూజ నిర్వహించబడును.

6. 14.11.2026 – శనివారం

- రాత్రి పెద్ద నంది సేవ.- సేవా రుసుము: రూ.80,000/-.

7. 15.11.2026 – ఆదివారం (స్కంద షష్టి)

- సాయంత్రం 7.00 గంటలకు శ్రీ చెంగల్వరాయస్వామి వారి నెమలి వాహనంపై నాలుగు మాడ వీధులలో ఉత్సవం.

8. 16.11.2026 – రెండవ కార్తీక సోమవారం

- ఉదయం అంబారి ఉత్సవం.
- సాయంత్రం నాలుగు మాడ వీధులలో ఉత్సవం.
9. 23.11.2026 – మూడవ కార్తీక సోమవారం
- సాయంత్రం నాలుగు మాడ వీధులలో ఉత్సవం.
- సాయంత్రం బాలదీపం కార్యక్రమం.

10. 24.11.2026 – మంగళవారం (కార్తీక పౌర్ణమి / కార్తీక దీపోత్సవం)

- ఉదయం పెద్ద నంది వద్ద తాటి చెట్టును నిలుపుట.
- సాయంత్రం చొక్కాణి ఉత్సవం.
- నాలుగు మాడ వీధులలో ఉత్సవం.

11. 28.11.2026 – శనివారం

- ఉదయం 6.00 గంటలకు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు ప్రారంభం.

12. 29.11.2026 – ఆదివారం
- జాతర చాటు కార్యక్రమం.

13. 30.11.2026 – సోమవారం

- లక్ష బిల్వార్చన సందర్భంగా నాలుగు మాడ వీధులలో ఉత్సవం నిర్వహించబడదు

14. 02.12.2026 – బుధవారం

- శ్రీ ఏడు గంగమ్మల జాతరకు సారె సమర్పణ.
- శ్రీ ఏడు గంగమ్మల జాతర నిర్వహణ.

15. 07.12.2026 – ఐదవ కార్తీక సోమవారం

- లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలకు ముగింపు.
- ఈ సందర్భంగా నాలుగు మాడ వీధులలో ఉత్సవం నిర్వహించబడదు.

16. 08.12.2026 – మంగళవారం

- ఉదయం అష్టోత్తర శత కలశాభిషేకం.
- మధ్యాహ్నం కుంభం (తిరుప్పావై) కార్యక్రమం.
- బిల్వములు, కుంకుమ నదిలో నిమజ్జనం.
- సాయంత్రం స్వర్ణముఖి నదికి హారతులు.
- రాత్రి నంది సేవ.

కావున కార్తీక మాసంలో నిర్వహించబడే ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరస్వామి వార్ల కృపాకటాక్షాలకు పాత్రులు కావలసిందిగా దేవస్థానం అధికారులు కోరారు.  వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*