మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత
సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలంలోని హాసాకొత్తూర్ గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ అలియాస్ రాజు అక్టోబర్ 28 న దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెరుకు గంగాధర్ నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహకారం కోసం సోషల్ మీడియా ప్రచారం జరుతున్న విషయం తెలుసుకొని లండన్ లో ఉంటున్న గడ్డం రాజేష్ గంగాధర్ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయంగా 20000 వేల రూపాయలు పంపించారు. అట్టి ఆర్థిక సహాయం మిత్రులు క్రాంతి, శ్రీనాథ్, శ్రీధర్, అశోక్, మారుతి, రంజిత్, రాకేష్, అరుణ్ తదితరులు కలిసి చెరుకు గంగాధర్/రాజు కుటుంబానికి అందజేశారు. గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచినందుకు గంగాధర్ కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, స్ఫూర్తి యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు గడ్డం రాజేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.