telangana
ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు
సూర్య ఎల్లారెడ్డి,;;ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం“మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాల వద్ద దీపాలు వెలిగించి, పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్ పర్సన్ మత్త మాల భాగ్యవతి, లు మాట్లాడారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, లబ్ధిదారులు తమ సొంత ఇళ్లలో దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరంమున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలను నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.