పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసిన రేణిగుంట పోలీసులు.
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట బస్టాండ్‌లో మూడు నెలల క్రితం పోగొట్టుకున్న మోటో మొబైల్ ఫోన్‌ను రేణిగుంట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేశారు. CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి గుర్తించిన పోలీసులు, సోమవారం బాధితుడు పాతగుంట హరికి తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే సంబంధిత వివరాలతో పై తెలిపిన పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, రికవరీ చేసిన అనంతరం బాధితులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.