జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం
జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-పట్టణంలోని ఎ.జి.ఎస్. కళాశాలలో 07-11-2026, శనివారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
వత్సవాయి మండలం, మంగోల్లు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బొల్లం హనుమంతరావు కి చెందిన కారుపై మంగొల్లు గ్రామ టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడి, కారు అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న అభ్యర్థులపై దాడులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించి, సమగ్ర విచారణ జరిపి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు శాఖను డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, కార్యకర్తల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రిపోర్టర్