గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నిధులు మంజూరయ్యాయి.ఈ సందర్భంగా మంజూరైన నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను గ్రామ ప్రజలకు, సంబంధిత సంఘం ప్రతినిధులకు బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి సోమవారం జగిత్యాలలో అందజేశారు.ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదారి అశోక్,జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి,ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నరపాక అశోక్, అర్బన్ మండల ఉపాధ్యక్షులు తిరుపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దానపనేని నరేష్, సల్ల రమేష్, ఇట్యాల రాము,మ్యాదరి శ్రీనివాస్, మారవేణి మల్లేశం, బింగిశెట్టి తిరుపతి, పంబల వసంత్, బలె సంతోష్, అక్కినపల్లి కాశీనాథం, ఇనుగుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.