BREAKING
చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి పత్రికా స్వేచ్ఛను కాపాడి, పాత్రికేయులకు భద్రత కల్పించాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ జెన్సన్ హువాంగ్‌కు ట్రంప్ మద్దతు: ఆయనపై నమ్మకం ఉందన్న అమెరికా అధ్యక్షుడు డెమొక్రాట్ల అభిశంసన హెచ్చరికలపై ట్రంప్ ఆగ్రహం: జస్టిస్ శాఖ విచారణకు ఆదేశం మెక్సికోలో జాలిస్కో కార్టెల్ కీలక నేత అరెస్ట్ రొమేనియాతో సరికొత్త విద్యుత్ లైన్‌ను ప్రారంభించిన మోల్దోవా: రష్యాకు చెక్ జేడీ వాన్స్‌పై అమెరికా తొలి ముస్లిం సెనేటర్ విమర్శలు స్థానిక ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు చైనా నివాస భవనంలో అగ్నిప్రమాదం: 14 మంది దుర్మరణం బంగ్లాదేశ్ తిరుగు ప్రయాణానికి పాస్‌పోర్ట్ కోరిన షేక్ హసీనా భగవద్గీతతో జీవిత సత్యాలను తెలుసుకోవాలి.. విద్యార్థులకు డాక్టర్ నిర్మలమురళి అవగాహన అమెరికా అణు ప్రాజెక్టు పెట్టుబడులపై దక్షిణ కొరియా సమీక్ష నాలా’ పేరుతో రియల్టర్ల మాయాజాలం

మరికల్‌లో నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి

Select Suryaa Now
మరికల్‌లో నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి

ప్రజావాణిలో అధికారులకు వినతి.. గ్రామస్తుల సంక్షేమం కోసం నాయకుల చొరవ

పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్ : మండల పరిధిలోని మరికల్ గ్రామంలో నాటుసారా విక్రయాలను పూర్తిగా అరికట్టాలని మాజీ ఉపసర్పంచ్ జగన్, వార్డు సభ్యుడు కావలి శివుడు కోరారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో నాటుసారా విక్రయాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, మద్యం సేవించిన కొందరు రాత్రివేళల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గొడవలకు దిగుతున్నారని తెలిపారు. ఈ పరిణామాలతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అక్రమ విక్రయాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సమస్యపై స్పందించి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన నాయకుల చొరవను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పుట్ట విష్ణు, పల్లపు లింగస్వామి, ఎర్రమోని కురుమయ్య పాల్గొన్నారు.