*ఏపీ కూటమి తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన దమ్మపేట మండల టీడీపీ*
సూర్య,దమ్మపేట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని దమ్మపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండీ వలీపాషా పేర్కొన్నారు.ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, కూటమి తరపున గెలిచిన నగర మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, జడ్పిటిసి, ఎంపిటిసిలకు దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపేరు ఈ సందర్బంగా సోమవారం దమ్మపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు ఎండీ వలీపాషా మాట్లాడుతూ, ఏపీలో కూటమి తరపున గెలిచిన మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, జడ్పిటిసి, ఎంపిటిసిలకు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ మీడియా సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ కట్టం ఎర్రప్ప, తెలుగు రైతు అధ్యక్షులు గడ్డిపాటి సత్యనారాయణ, నాయుడు వీరాస్వామి, బొల్లా మోహన్ రావు, పారుపల్లి భద్రం, భోగి సత్యం, చిర్ర ధర్మారావు, నాయుడు సుబ్బారావు, పానుగంటి రామారావు, అల్లాడి అప్పారావు, ఊకె కుమారి, చక్రపు ప్రసాద్, బాబురావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట