BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం :జడ్జి రూపశ్రీ సీఎంను విమర్శిచే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఇరాక్ ఖోర్ మోర్ గ్యాస్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి: నిలిచిన ఉత్పత్తి దక్షిణాఫ్రికా స్థానిక ఎన్నికల్లో పాలక ఏఎన్‌సీకి ఘోర పరాజయం అరుణాచల యాత్రకు ఏపిఎస్ ఆర్టిసీ ప్రత్యేక బస్సులు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ. ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల నివారణకు పటిష్ట చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మావల లో ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు - పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భక్తులకు ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ సదుపాయం జనగణన – 2027ను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు - ఆనందంలో రైతులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అంగన్‌వాడీ పోస్టుల ప్రొవిజనల్ జాబితా ప్రదర్శన సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు - ప్రజలకు నగర మేయర్ శుభాకాంక్షలు

రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః సిద్దిపేట - హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదమని, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ భార్య స్వాతికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడు శ్రీహాన్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కోరారు. రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని మంత్రి సూచించారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.