BREAKING
గ్లోబల్ లగ్జరీ యాచ్ మార్కెట్లో రాణిస్తున్న ట్యునీషియా బోట్‌బిల్డర్స్ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి... ఎంఎల్ఏ " కోండ్రు " విమానయాన ఇంధనంలో విప్లవం: డీజీసీఏ, నీతి ఆయోగ్, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సమన్వయం ముందస్తు ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యం * హాజరైన ఐసిడిఎస్ పిడి బాలామణి * దీపావళి టపాసుల ఉన్మాదంపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం: అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇల్లు, బాల్కనీ కేకేఆర్ సంస్థలో పెరిగిన అసెట్ సేల్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన. మాజీ ఎమ్మెల్యే కడు బండి నటుడిగా మారకముందు హోటల్‌లో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వలిచాను: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు నవంబర్ 13న అత్యధిక సంఖ్యలో అగ్నివీర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ఘన విజయంపై ఎమ్మెల్యే బీవీ హర్షం అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ భారత్-ఓమాన్ నావికాదళాల విన్యాసాలు జాతీయ స్థాయి అండర్-19 బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ కు అఖిల్ ఎంపిక 'కళా' విహీనం! ఎన్టీఆర్, త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై సందిగ్ధత: భారీ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడటానికి అసలు కారణమిదేనా

సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు - ప్రజలకు నగర మేయర్ శుభాకాంక్షలు

Select Suryaa Now
సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు -  ప్రజలకు నగర మేయర్ శుభాకాంక్షలు
సూర్య నస్పూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ తన స్వగృహంలో ఆదివారం సాయంత్రం దీపావళి పండుగను పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ…  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు, మహిళలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో పయనించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.