BREAKING
పత్తి కొనుగోళ్ళు  వెంటనే ప్రారంభించాలి - మాజీ మంత్రి జోగు రామన్న పేదలకు న్యాయమే లక్ష్యం - ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా కీలక నిర్ణయం 17 ఎంపీటీసీలు గెలిచినా.. జెడ్పీటీసీ ఎందుకు చేజారింది? * నరసన్నపేట కూటమిలో మొదలైన ఆత్మపరిశీలన * మెకానిక్ వర్క్ షాప్ లో భారీ మంటలు 15 లక్షల ఆస్తి నష్టం కోడి పందాల స్థావరంపై వేంసూర్ పోలీసులు దాడి డిస్నీ, అడోబ్ కీలక ఒప్పందం పంట కుంటతో పల్లీ పంటకు నీటి తడి నార్డియా బ్యాంకుకు భారీ ఊరట చిన్నారులతో దీపావళి వేడుకలు * పండుగ సామగ్రి పంపిణీ చేసిన సైలాడ సతీష్ * ఘనంగా ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవ వేడుకలు స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి జరుపుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం విద్యుత్ బిల్లుల కేంద్రం వద్ద వినియోగదారుల తీవ్ర అవస్థలు అమెరికాను వణికిస్తున్న మాంసాన్ని తినే పురుగు ముప్పు

అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తాం

Select Suryaa Now
అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తాం

అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తాం
*మంచాల సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్*

*చెన్నారెడ్డిగూడలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం*

*మంచాల :* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంచాల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మించుకున్న లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, వారితో కలిసి దీపాలు వెలిగించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను శాలువాలతో సన్మానించి, బాణాసంచా కాల్చి దీపావళి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా జెనిగే వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంబోతు కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ముచ్చర్ల వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు రత్నావత్ హర్య నాయక్, కాట్రోత్ హర్య, మంచర్ల క్రాంతి కుమార్, నెట్టు బౌరమ్మ, కాట్రోత్ మధు నాయక్, ఆంబోతు లావణ్య, మాజీ ఎంపీటీసీ లాలు నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్రమోని శ్రీశైలం, నెట్టు మంజుల, గ్యార రాజు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు పగడాల శ్రీశైలం, కార్యదర్శి రాజు, నాయకులు చీమల రమేష్, గ్యార పెంటయ్య, నెట్టు వెంకటయ్య, చీమల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

*✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల*