స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి జరుపుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్
పాతపట్నం, సూర్య : పాతపట్నం మండలం తామర గ్రామంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒకేచోట చేరి ఆప్యాయతానురాగాల నడుమ సంబరాల్లో పాల్గొనగా, ప్రమిదల వెలుగులు, బాణసంచా సందడితో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. కుటుంబ బంధాలు, ఆత్మీయతలకు ప్రతీకగా సాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అందరితో కలిసి సంతోషంగా గడిపారు.