400 క్వింటాల సబ్సిడీ సెనగ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరబీ 2026 సాగు సీజన్‌ను పురస్కరించుకుని రంగంపేట మండలంలో రైతులకు 35 శాతం రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. మండలంలోని నాలుగు గ్రామాలకు మొత్తం 400 క్వింటాళ్ల జీజీ-11 రకం ధృవీకరించిన విత్తనాలను వ్యవసాయ శాఖ కేటాయించింది.గ్రామాల వారీగా చండ్రేడుకు 70 క్వింటాళ్లు, పెదరాయవరానికి 100 క్వింటాళ్లు, రంగంపేటకు 80 క్వింటాళ్లు, వడిశలేరుకు 150 క్వింటాళ్లు కేటాయించారు. ఎకరాకు 40 కిలోల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. సబ్సిడీ విత్తనాలు పొందాలనుకునే రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ లేదా 1-బి అడంగల్ పత్రాలతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. డీ-కృషి యాప్‌లో వివరాల నమోదు అనంతరం విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.